ఎస్‌బీఐ ఏటీఎమ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. 4 మిషన్లు దగ్ధం
Fire accident in SBI ATM.అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌బీఐ
By తోట వంశీ కుమార్ Published on
10 April 2021 10:35 AM GMT

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌బీఐ ఏటీఎమ్ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నాం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే స్థానికులు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో నాలుగు ఏటీఎమ్ మిషన్లు కాలి బూడిదయ్యాయి. అయితే.. ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది అన్నది తెలియరాలేదు.
ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, బ్యాంకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుసుకున్నారు. కాగా.. ఏటీఎమ్‌లో ఉన్న నగదు ఎలా ఉందో ఇంకా చూడాల్సి ఉంది. దీని తరువాతనే ఎంత నష్టం వాటిల్లింది అనేది చెప్పగలం అని బ్యాంకు అధికారులు తెలిపారు.
Next Story