ఒంగోలులో భారీ అగ్నిప్ర‌మాదం.. 9 ప్రైవేటు బ‌స్సులు ద‌గ్థం

Fire accident in Prakasam District.ప్ర‌కాశం జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఒంగోలు ప‌ట్ట‌ణంలోని ఉడ్‌కాంప్లెక్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2022 10:51 AM IST
ఒంగోలులో భారీ అగ్నిప్ర‌మాదం.. 9 ప్రైవేటు బ‌స్సులు ద‌గ్థం

ప్ర‌కాశం జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.ఒంగోలు ప‌ట్ట‌ణంలోని ఉడ్‌కాంప్లెక్స్ స‌మీపంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌లు ప‌క్క‌నే పార్కింగ్ చేసి ఉన్న కావేరి ట్రావెల్స్ బ‌స్సుల‌కు అంటుకున్నాయి. మంట‌ల ధాటికి తొమ్మిది బ‌స్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. మ‌రో రెండు బ‌స్సుల‌కు మంట‌లు అంటుకున్నాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు శ్ర‌మిస్తున్నారు. పార్కింగ్ స్టాండ్‌లో దాదాపు 20పైగా బ‌స్సులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మిగిలిన బ‌స్సుల‌ను అక్క‌డ నుంచి ప‌క్క‌కు త‌ర‌లిస్తున్నారు. కాగా.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Next Story