కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. అంపాపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న రుచి పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రొక్లెయిన్, ట్రాక్టర్ పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
కాగా.. గ్రామ శివారులో ఈ కంపెనీ ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని బావిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు బావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.