కాకినాడలోని జీఎంఆర్‌ పవర్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Fire accident in Kakinada GMR Power plant.తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ప‌ట్ట‌ణం బీచ్‌రోడ్డులోని జీఎంఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2021 5:11 AM GMT
కాకినాడలోని జీఎంఆర్‌ పవర్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ప‌ట్ట‌ణం బీచ్‌రోడ్డులోని జీఎంఆర్ ప‌వ‌ర్‌ప్లాంట్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. శ‌నివారం ఉద‌యం ప‌వ‌ర్‌ప్లాంట్‌లో భారీగా మంట‌లు చెల‌రేగాయి. ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డుతుండ‌డంతో పాటు ద‌ట్ట‌మైన పొగ వ్యాపించింది. కాగా.. గ‌త 5 సంవ‌త్స‌రాలుగా ఈ ప్లాంట్ మూత‌ప‌డి ఉంది. పవర్ ప్లాంట్‌లో వెల్డింగ్ ప‌నులు చేస్తుండగా నివ్వురవ్వలు పైబర్ షిట్‌పై పడటంతో మంటలు చెలరేగిన‌ట్లు తెలుస్తోంది.

స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. నాలుగు పైరింజ‌న్ల‌తో అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున్నారు. మంట‌లు అదుపులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్నారు. ప్లాంట్ మూసేసి ఉండ‌డంతో అందులో ఉద్యోగులు ఎవ‌రూ లేరు. కాగా.. ఈ ప్ర‌మాదంలో ప‌వ‌ర్‌ప్లాంట్‌లో సుమారు 700శాతం నిర్మాణ సామాగ్రి అగ్నికి ఆహుతి అయిన‌ట్లు తెలుస్తోంది.

Next Story
Share it