ఏపీలోని సిమెంట్ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బొగ్గు వేడి చేసే ప్రాంతంలో గ్యాస్ లీకై పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగకపోయినప్పటికీ భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలో ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలోని ఎల్‌వన్ యూనిట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బొగ్గును వేడి చేసే ప్రాంతంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. ఆ సమయంలో కార్మికులు టీ తాగేందుకు బయటకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు ఫైర్ ఇంజిన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం జరగపోయినప్పటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.