విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలోని కొండవానిపాలెం గిరిజన గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొదట ఓ ఇంటిలో చెలరేగిన క్రమంగా వ్యాపించాయి. పూరిళ్లు కావడంతో.. మంటలు వేగంగా వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
అయితే.. అప్పటికే 40 పూరిళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తహశీల్దార్ సీతారామరాజు తెలిపారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. మంటలు ఎలా వ్యాపించాయన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.