సాధారణంగా ఇరుగుపొరుగు అంటే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ ఉండడం సర్వసాధారణమే. అయితే వాటన్నింటినీ లైట్ గా తీసుకొని సర్దుకు పోతుంటారు. అయితే ఇలాంటి చిన్న గొడవలే ఒక్కోసారి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. అలాంటి గొడవలే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఒకటి చోటు చేసుకుంది. ఒక ప్యాంటు కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకొని చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

నగరంలోని ఓబుళదేవనగర్‌కు చెందిన ప్రసాద్‌ హౌసింగ్‌బోర్డులోని రాహుల్ (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) ఇంటిలో ధోబిగా పని చేస్తున్నాడు. ఇటీవల ప్రసాద్ దోబీ నిర్వహిస్తున్న సమయంలో వేరొకరి ప్యాంటు రాహుల్ ఇంటికి వెళ్ళింది. అయితే ఈ విషయమే ప్రసాద్ వేరొకరి ప్యాంటు పొరపాటున మీ ఇంటికి కట్టానని చెప్పగా అందుకు బీట్ ఆఫీసర్ కుటుంబ సభ్యులు అలాంటిది మా ఇంటిలో ఏమీ లేదు. ఒకవేళ ఇంటి ఓనర్ వాళ్ల బట్టలలో కలిసిందేమో తెలుసుకొని చెబుతామని తెలిపారు.

ఈ విషయమే రాహుల్ ఇంటి ఓనర్ అయినా చంద్రశేఖర్ అతని కుటుంబ సభ్యుడు రాజేష్"మీకు ఎలా కనబడుతున్నాం"అంటూ ప్రసాద్ పై మండిపడ్డారు. దీంతో ప్రసాద్ తన సోదరుడు రమణను తీసుకుని బీట్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య మాటా మాటా పెరగడంతో బీట్ ఆఫీసర్ చేతిలో ఉన్న కర్రతో రమణ పై దాడి చేశాడు. ఈ క్రమంలోనే రమణ కంటికి గాయమవడంతో వారు సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖర్, రాజేష్, బీట్ ఆఫీసర్ రాహుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిరువురి మధ్య పరస్పర ఆరోపణలు ఉండటంచేత టూ టౌన్ ఎస్ఐ వీరిరువురి పై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.


సామ్రాట్

Next Story