అభిమానుల అత్యుత్సాహం.. బాణ‌సంచా కాల్ప‌డంతో థియేట‌ర్‌లో మంట‌లు

Fans Are Enthusiastic fireworks in the theater caused a fire.అభిమానం హ‌ద్దుల్లో ఉంటే ఫ‌ర్వాలేదు గానీ..ఒక్కోసారి ఫ్యాన్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2022 1:43 PM IST
అభిమానుల అత్యుత్సాహం.. బాణ‌సంచా కాల్ప‌డంతో థియేట‌ర్‌లో మంట‌లు

అభిమానం హ‌ద్దుల్లో ఉంటే ఫ‌ర్వాలేదు గానీ.. ఒక్కోసారి ఫ్యాన్స్ చేసే హంగామా త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం. ఇటీవ‌ల అభిమానుల అత్యుత్సాహం, చేష్ట‌ల కార‌ణంగా థియేట‌ర్లు త‌గ‌ల‌బ‌డి పోతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కమల్ హాసన్ హీరోగా నటించిన 'విక్రమ్' చిత్రం విడుద‌ల స‌మ‌యంలో ఆఖ‌ర్లో హీరో సూర్య ఎంట్రీ సీన్ రాగానే ఫ్యాన్స్ థియేటర్లోనే బాణసంచా కాల్చారు. దీంతో ఆ థియేటర్ తగలబడిపోయింది. తాజాగా అలాంటి ఘ‌ట‌న‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది.

నేడు(అక్టోబ‌ర్ 23) యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెంలోని వెంక‌ట్రామ థియేట‌ర్‌లో 'బిల్లా' చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇటీవ‌లే ఈ థియేట‌ర్ మూత ప‌డిన‌ప్ప‌టికీ అభిమానుల కోరిక మేర‌కు ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. అత్యుత్యాహం ప్ర‌ద‌ర్శించిన అభిమానులు సినిమా మ‌ధ్య‌లో సీట్ల మీద బాణ సంచా కాల్చారు. దీంతో సీట్లు కాలిపోయి థియేట‌ర్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పొగ వ్యాపించ‌డంతో భ‌యాందోళ‌న‌కు గురైన ప్రేక్ష‌కులు బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పివేశారు. అభిమానులు ఇలా చేస్తుండ‌డంతో సినిమాల‌ను ప్ర‌ద్శించాలంటేనే థియేట‌ర్ల ఓన‌ర్లు భ‌య‌ప‌డిపోతున్నారు.

Next Story