ఉగాది పండుగ వేళ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీ బజార్‌లోని ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇంట్లో నలుగురు విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులను కృష్ణాచారి, ఆయన భార్య సరళమ్మ, పిల్లలు సంతోష్, భువనేశ్‌గా గుర్తించారు.
సంతోష్ పదోవ తరగతి చదువుతుండగా, భవనేష్ ఆరో తరగతి చదువుతున్నాడు. వీరంతా విషం తాగి మృతి చెందినట్టు సమాచారం. కృష్ణాచారి గోల్డ్ వ్యాపారం చేసేవారని, ఆర్థిక సమస్యలతో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.