అనకాపల్లి జిల్లాలో పేలుడు కలకలం.. నలుగురి పరిస్థితి విషమం

Explosion in Anakapalli district. Four people are in serious condition. అనకాపల్లి జిల్లాలో పేలుడు కలకలం రేపింది. సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ చిన్న యాటపాలెం సమీపంలో

By అంజి  Published on  6 Sept 2022 12:49 PM IST
అనకాపల్లి జిల్లాలో పేలుడు కలకలం.. నలుగురి పరిస్థితి విషమం

అనకాపల్లి జిల్లాలో పేలుడు కలకలం రేపింది. సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ చిన్న యాటపాలెం సమీపంలోని బాణసంచా గోడౌన్‌లో పేలుడు సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన శంకర్‌రావు (48), కమలమ్మ (38), మహేష్‌, ప్రసాద్‌లను స్థానికులు హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పేలుడు సంభవించిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఓ ముఠా రహస్య ప్రాంతంలో పటాకులు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు కంచరపాలెంకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు మరో ఇద్దరి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఉదయం వంట చేస్తుండగా బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో సబ్బవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story