పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో పేలుడు

Explosion at Gangadhara Nellore police station.గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆవ‌ర‌ణ‌లో పేలుడు సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Oct 2022 11:47 AM IST
పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో పేలుడు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆవ‌ర‌ణ‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి పోలీస్ స్టేష‌న్ అద్దాలు, కిటికీలు, త‌లుపులు, ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా వివిధ కేసుల్లో ప‌ట్టుబ‌డిన కార్లు, బైక్‌లు, సీజ్ చేసిన వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి.


మండ‌ల ప‌రిధిలో క్వారీల‌కు అక్ర‌మంగా ర‌వాణా అవుతున్న న‌ల్ల‌మందు, జిలెటిన్ స్టిక్స్‌ను ఇటీవ‌ల పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసుస్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఉంచారు. అయితే.. ఈ తెల్ల‌వారుజామున భారీ శ‌బ్ధంతో న‌ల్ల‌మందు జిలెటిన్ స్టిక్స్ పేలిపోయాయి. పేలుడు స‌మ‌యంలో జ‌న సంచారం లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

Next Story