భార్య వీడియోపై మాజీ మంత్రి నారాయణ తమ్ముడు క్లారిటీ

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు నారాయణపై ఆయన తమ్ముడు పొంగూరు సుబ్రహ్మణ్యం భార్య ప్రియా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

By అంజి  Published on  30 July 2023 5:54 AM GMT
Ex Minister Narayana, subrahmanyam , pongurupriya, APnews

భార్య వీడియోపై మాజీ మంత్రి నారాయణ తమ్ముడు క్లారిటీ

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు నారాయణపై ఆయన తమ్ముడు పొంగూరు సుబ్రహ్మణ్యం భార్య ప్రియా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రియా.. ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్‌ చేసిన వీడియో కలకలం సృష్టిస్తోంది. తనను నారాయణ తీవ్రంగా హింసిస్తున్నారని.. అర్ధరాత్రి పూట నన్ను టార్చర్‌ పెడుతున్నారంటూ ప్రియ ఆరోపణలు చేశారు. ఈ వీడియో నెట్టింట దుమారం రేపుతుండటంతో.. ఎట్టకేలకు నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో తన భార్యకు సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టారు. తన భార్య ప్రియా మానసిక ఆరోగ్యంతో బాధపడుతోందని, మానసిక ఒత్తిడితోనే ఏవేవో వీడియోలు చేస్తోందని, ఆమె తమ కుటుంబంపై మాట్లాడిన వీడియోలను ఎవ్వరూ పట్టించుకోవదని సుబ్రహ్మణ్యం కోరారు. నారాయణపై ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.

మానిసక ఆరోగ్యం లేని కారణంగానే ఆమె అలా మాట్లాడుతోందని తెలిపారు. ''ఒక వారం రోజులుగా నా భార్య ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా పోస్టు చేసిన వీడియోలు.. నాకూ, నా కుటుంబం పరువుకు భంగం కలిగించేదిగా ఉన్నాయి. 2017లోనే ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాము. 2019 ఆమె స్వగ్రామంలో కూడా చికిత్స ఇప్పించాం. 2020లో డాక్టర్ విరంచి దగ్గర కూడా చూపించాం,.. అయినా కూడా ఆమె తీరులో మార్పు రాలేదు. క్యాన్సర్‌తో కూడా ఆమె బాధపుతోంది. ఆమె మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఆమె పెట్టే వీడియోలను పట్టించుకోవద్దు''అని పొంగూరు సుబ్రహ్మణ్యం మనవి చేసుకున్నారు. ఆమెకు చెందిన పలు ట్రీట్మెంట్లకు సంబంధించిన రికార్డులను సుబ్రహ్మణ్యం మీడియాకు చూపించారు.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ప్రియా మాట్లాడుతూ.. నారాయణ పర్సనల్‌ విషయాలను బయటపెట్టింది. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని, అయినా తనను అన్నం తీసుకురావాలని కొట్టేవారని ఆరోపించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఇబ్బంది పెట్టారని, తన కుటుంబాన్ని కూడా వేధించినట్లు చెప్పుకొచ్చింది. తనను తీవ్రంగా హింసించారని, నైట్‌ సమయంలో కూడా వేధింపులు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి జరిగినప్పటి నుంచి తనకు నరకం చూపించారని, కానీ కుటుంబ విషయాలు బయట పెట్టకూడదనే ఉద్దేశంతో ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 29 ఏళ్లుగా నారాయణ వల్ల నరకం అనుభవిస్తున్నానని, ఆయన వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టేందుకు ఇప్పుడు సిద్దంగా ఉన్నట్లు వీడియోలో ప్రియ తెలిపింది.

Next Story