90 శాతం దుకాణాలు టీడీపీ నేతలకే ద‌క్కాయి: మాజీ మంత్రి కాకాని

మద్యం దుకాణాలకు సంబంధించి కొత్త విధానాన్ని తెచ్చామని ప్రభుత్వం చెప్పిందన్ని.. ముందస్తు ప్రణాళిక ప్రకారం స్థానికంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ కొనసాగిందని.. ప్రణాళిక ప్రకారమే చంద్రబాబు మద్యం దుకాణాల్లో దోపిడీకి తీశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  15 Oct 2024 7:15 AM GMT
90 శాతం దుకాణాలు టీడీపీ నేతలకే ద‌క్కాయి: మాజీ మంత్రి కాకాని

మద్యం దుకాణాలకు సంబంధించి కొత్త విధానాన్ని తెచ్చామని ప్రభుత్వం చెప్పిందన్ని.. ముందస్తు ప్రణాళిక ప్రకారం స్థానికంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ కొనసాగిందని.. ప్రణాళిక ప్రకారమే చంద్రబాబు మద్యం దుకాణాల్లో దోపిడీకి తీశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు మద్యంపై చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ నియంత్రణలో మద్యం దుకాణాలు నిర్వహిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని.. నియంత్రణ కూడా ఉంటుందన్నారు. కొత్త విధానం వల్ల చంద్రబాబు తో పాటు టిడిపి నేతలకు ప్రయోజనం కలుగుతుందన్నీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలను నిర్ణయించేందు కోసమే ఈ విధంగా చేశారన్నారు. లాటరీలో దుకాణాలు పొందిన వారి నుంచి ఎమ్మెల్యేలు వసూళ్ళు ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఎవరూ ఎమ్మార్పీ ధరకు విక్రయించరు.పేదవాడికి నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేస్తారన్నారు. వైసిపి హయాంలో ఒక డిస్టీలరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. చంద్రబాబు హయాంలో 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారన్నారు. మద్యం పాలసీలో నియమ నిబంధనలు పాటించలేదన్నారు. ఆలయాలు, పాఠశాలల పక్కనే దుకాణాలు పెడుతున్నారన్నారు. వైసిపి హయాంలో బెల్ట్ దుకాణాల లేకుండా జగన్ చూశారన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెబ్ ను కూడా ఏర్పాటు చేశారు..అంతేకాక మద్యం దుకాణాలను కూడా తగ్గించారన్నారు. ప్రజల కూడా అన్నీ పరిశీలిస్తున్నారు..త్వరలో వారే తిరగబడతారన్నారు. జమిలి ఎన్నికలు వస్తే రెండేళ్ల పాటే ఈ ప్రభుత్వం ఉంటుందని..అధికారులు కూడా నియమ. నిబంధనలు పాటించాలన్నారు. చంద్రబాబు శాశ్వతంగా అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

Next Story