జేసీ బ్రదర్స్ ఇళ్ల‌లో ఈడీ సోదాలు

Enforcement Directorate raids on JC Brothers houses.అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 17 Jun 2022 10:10 AM IST

జేసీ బ్రదర్స్ ఇళ్ల‌లో ఈడీ సోదాలు

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు సోదాలు చేప‌ట్టారు. ఆయ‌న సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, క్లాస్‌-1 కాంట్రాక్ట‌ర్ చ‌వ్వ గోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాల‌యాల్లో ఈడీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంట్లోకి రానీవ్వ‌డం లేదు.

తాడిపత్రితో పాటు హైదరాబాద్‌లోని ఇళ్ల‌లో కూడా అధికారులు.. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేప‌ట్టారు. ఆస్తుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను సిబ్బంది ప‌రిశీలిస్తున్నారు. సుమారు 20 మందికి పైగా అధికారులు సోదాల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

Next Story