తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు మరో షాక్ తగిలింది. నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ నోటీసులను జారీ చేశారు. ధూళిపాళ్ల ట్రస్టు ఆధ్వర్యంలో డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది. పాల రైతుల కుటుంబ సభ్యులకు ఈ ఆస్పత్రిలో 50శాతం రాయితీతో వైద్యం అందిస్తున్నారు.