ఏలూరులో వణికిస్తున్న వింత వ్యాధి.. 382కు చేరిన బాధితులు
Eluru incident.. 382 victims ... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. రెండు
By సుభాష్ Published on 7 Dec 2020 10:28 AM ISTఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. రెండు రోజులుగా ఈ వింత వ్యాధి అందరిని వణుకు పుట్టిస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అధిక సంఖ్యలో అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలు కావడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రెండు రోజులుగా ఈ వింత వ్యాధి ఏంటో తెలియకపోవడం మరింత కలకలం రేపుతోంది. ఈ అంతు చిక్కని వ్యాధి కారణంగా ఏలూరు జిల్లాల్లోని చుట్టుపక్కల గ్రామాలప్రజలు సైతం తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరుతున్నారు. అయితే రోగులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో వైద్యులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. నీటి సరఫరా పై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ వింత వ్యాధిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ వింత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందు కోలుకోగా, ఇప్పటి వరకు ఈ వింత వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 382కు చేరింది. ఇప్పటి వరకు 187 మంది చికిత్స పొందు కోలుకున్నారు. ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రోగుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోకి వెళ్లిన వైద్య బృందాలు సైతం రక్త నమూనాలు సేకరిస్తున్నారు. సోమవారం (నేడు) సీఎం జగన్ ఏలూరుకు బయలుదేరనున్నారు. రోగులను పరామర్శించనున్నారు.
ఫిడ్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు బెడ్‌లను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాటి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్, అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. నిన్న ఉదయం నుంచి క్రమంగా కేసులు తగ్గాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు.
సీఎం కార్యాలయం నుంచి గంట గంటకు ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు. నీరు, ఫుడ్ పాయిజన్ లాంటివి ఏవి జరగలేదని తెలుస్తోంది. అయితే విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. నిపుణుల బృందాలు కూడా ఏలూరుకు రానున్నాయి. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాలంటీర్లు సర్వే చేపట్టారు. వైద్య శిబిరాల్లో వారి నుంచి బ్లడ్ షాంపిల్స్‌ను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించారు.