ఆంధ్రప్రదేశ్‌లోని ఆ స్థానాలలో పోలింగ్ సమయాల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా ఆరు స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులను ప్రకటించారు

By Medi Samrat  Published on  19 April 2024 11:29 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లోని ఆ స్థానాలలో పోలింగ్ సమయాల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా ఆరు స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులను ప్రకటించారు. మే 13, 2024న అన్ని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక సమయాలు నిర్దేశించారు.

అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని, ఈ ప్రాంతాల్లో తక్కువ వ్యవధిలో ఓటింగ్‌ ఉంటుందని సీఈవో తెలిపారు. అదనంగా, పాలకొండ, కురపాం మరియు సాలూరు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, భద్రంగా సాగేందుకు విస్తృత ఏర్పాట్లను చేశామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల విధుల్లో రాష్ట్రవ్యాప్తంగా 3.3 లక్షల మంది సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో 300 కంపెనీల బలగాలు రానున్నాయని.. రాష్ట్రంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామన్నారు.

Next Story