ఏపీ లిక్కర్ స్కామ్‌లో రూ.441.63 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది.

By -  Knakam Karthik
Published on : 6 March 2026 9:38 PM IST

Andrapradesh, AP liquor scam, ED, PMLA

ఏపీ లిక్కర్ స్కామ్‌లో రూ.441.63 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బూనేటి చాణక్యకు సంబంధించిన సంస్థలు, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి బంధువులు మరియు ఇతరులకు చెందిన 441.63 కోట్ల విలువైన చరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో బ్యాంకు బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు మరియు ఇతర స్థిరాస్తులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఖజానాకు సుమారు 4000 కోట్ల నష్టం వాటిల్లిందని సిఐడి నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడి దర్యాప్తు ప్రారంభించింది. 2019 తర్వాత మద్యం సరఫరా వ్యవస్థలో ఆటోమేటెడ్ విధానాన్ని నిలిపివేసి మాన్యువల్ విధానాన్ని అమలు చేయడంతో, సరఫరా ఆర్డర్లలో అక్రమాలు జరిగాయని దర్యాప్తులో తేలింది.

మద్యం బ్రాండ్ల ఎంపికలో వివక్ష చూపుతూ డిస్టిలరీల నుండి 15 నుంచి 20 శాతం వరకు కిక్‌బ్యాక్‌లు వసూలు చేసినట్లు ఈడి పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా సుమారు 3500 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్రమంగా సంపాదించిన నిధులను వివిధ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు ఈడి గుర్తించింది. కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story