ప్రకాశం జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లాలో ఆదివారం నాడు భూప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరులో ఉదయం 10.15 గంటల ప్రాంతంలో
By అంజి Published on 7 May 2023 12:00 PM ISTప్రకాశం జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లాలో ఆదివారం నాడు భూప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరులో ఉదయం 10.15 గంటల ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇళ్లలో నుండి భయంతో బయటకు పరుగులు తీశారు. వేంపాడు గ్రామాల్లో సైతం భూ ప్రకంపనలు వచ్చాయి. అకస్మాత్తుగా ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భూపరిశోధన అధికారులు భూకంప తీవ్రత ఎలా ఉంది అనే వివరాలు వెల్లడించలేదు. స్వల్ప భూప్రకంపనలు కాబట్టి సునామీ వచ్చే అవకాశాలు లేవు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ ఏడాది మార్చి 6వ తేదీన కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రతకు పలు ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. సిమెంట్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా రాష్ట్రంలోని ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది. పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూప్రకంపనాలు ప్రజలను భయకంపితులు చేస్తున్నాయి. ఏప్రిల్ 4న తిరుపతిలో స్వల్పంగా భూప్రకంపనాలు వచ్చాయి. తిరుపతిలోని దొరవారిసత్రంలో భూమి కంపించింది. ఇదిలాఉంటే.. ఉత్తర భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తాయన్న విషయం తెలిసిందే.