ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సోమవారం భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలంలోని రాతనలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భయంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనల కారణంగా పలు ఇళ్లకు బీటలు వారాయి. పలు చోట్ల సిమెంట్ రోడ్లు బీటలు వారాయి. భూ ప్రకంపనల విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి.. ఉన్నతాధికారులతో కలిసి రాతన ప్రాంతాన్ని పరిశీలించారు.
కాగా.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంత నమోదు అయ్యింది..? అనే విషయం తెలియరాలేదు. ఎన్ని ఇళ్లకు ఇళ్లు పగుళ్లు వచ్చాయి..? ఎంతమేరకు నష్టం వాటిల్లిందనే దాని గురించి అధికారులు స్థానికులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఎన్టీఆర్ , పల్నాడు జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆ జిల్లా వాసులు భయంతో వణికిపోయారు.