పులిచింత‌ల ప్రాజెక్టు స‌మీపంలో భూ ప్ర‌కంప‌న‌లు..!

Earth tremors near Pulichintala project.ప‌ల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు స‌మీపంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2023 9:43 AM IST
పులిచింత‌ల ప్రాజెక్టు స‌మీపంలో భూ ప్ర‌కంప‌న‌లు..!

ప‌ల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు స‌మీపంలో నేటి(ఆదివారం) ఉద‌యం భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. అచ్చంపేట మండ‌లం మాదిపాడు, చ‌ల్ల‌గ‌రిగ‌, గింజ‌ప‌ల్లి, జడేపల్లి తండా, కంచిబోడుతండాలో ఉద‌యం 7.28 గంట‌ల స‌మ‌యంలో భూమి కంపించింద‌ని స్థానికులు తెలిపారు. ఈ స‌మ‌యంలో భారీ శ‌బ్ధం వ‌చ్చింద‌ని అంటున్నారు. కొన్ని సెక‌న్ల పాటు భూమి కంపించిన‌ట్లు వారు తెలిపారు.

కాగా.. వారం వ్య‌వ‌ధిలో రెండు మూడు సార్లు ఇలా జ‌రిగిన‌ట్లు చెప్పారు. భూ ప్ర‌కంప‌న‌ల‌తో పులిచింత‌ల ప్రాజెక్టు స‌మీప గ్రామాల ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Next Story