గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆదివారం ఉదయం వరుస భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ రోజు ఉదయం 7.15 నుంచి 8.20 గంటల మధ్య భూమి కంపించినట్లు భూ భౌతిక పరిశోధన ముఖ్య శాస్త్రవేత్త శ్రీనగేష్ సైతం వెల్లడించారు. మొత్తం మూడు సార్లు భూమి కంపించినట్లు చెప్పారు. రిక్టర్ స్కేల్‌పై 3.0,2.7,2.3 గా నమోదు అయినట్లు తెలిపారు.
ఏపీలోని పులిచింతలతో పాటు తెలంగాణ పరిధిలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. గతవారం రోజులుగా పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే.. వరుస ప్రకంపనల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.