ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌.. తుపాను నేప‌థ్యంలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Due to Gulab Cyclone some Trains cancelled.బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర‌వాయుగుండం తుఫానుగా మారింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sept 2021 11:25 AM IST
ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌..  తుపాను నేప‌థ్యంలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర‌వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి గులాబ్ అని పేరు పెట్టారు. క‌ళింగ‌ప‌ట్నానికి ఈశాన్య దిశ‌లో 330 కి.మీ దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్‌-క‌ళింగ‌ప‌ట్నం మ‌ధ్య తీరం దాట‌నుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. కాగా.. గులాబ్ తుఫాను నేడు తీరం దాట‌నుండ‌డంతో రైల్వేశాఖ అప్ర‌మ‌త్తమైంది. ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా మ‌రికొన్నింటిని దారి మ‌ళ్లించింది. విశాఖపట్టణం, విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ, విజయనగరం వైపు వెళ్లే ఆరు రైళ్లను నేడు రద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పూరీ-ఓఖా ప్రత్యేక రైలును నేడు ఖుర్దారోడ్, అంగూల్, సంబల్‌పూర్ మీదుగా దారి మళ్లించినట్టు తెలిపారు.

నేడు హౌరా నుంచి సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్(02703) ఉదయం 08.35 గంటలకు బదులుగా మధ్యాహ్నం 02.35 బయలుదేరనుంది. అదే విధంగా హౌరా నుంచి యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్(02245) ఉదయం 10.50 గంటలకు బదులుగా మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరుతుంది.

నేడు రద్దైన రైళ్ల వివరాలు

07015- భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్,

02071- భువనేశ్వర్ నుంచి తిరుపతి,

02859-పూరి నుంచి చెన్నై సెంట్రల్,

02085- సాంబల్‌పూర్ నుంచి హెచ్ నాందేడ్,

07244- రాయఘడ నుంచి గుంటూరు

08463- భువనేశ్వర్ నుంచి కేఎస్సార్ బెంగళూరుసిటీ,

02845- భువనేశ్వర్ నుంచి యశ్వంత్‌పూర్

రేపు(సెప్టెంబ‌ర్ 27న‌) రద్దైన రైళ్ల వివరాలు

02072- తిరుపతి నుంచి భువనేశ్వర్,

02860-చెన్నై సెంట్రల్ నుంచి పూరి,

02086- హెచ్‌ఎస్ నాందేడ్ నుంచి సాంబల్‌పూర్,

08464- కేఎస్సార్ బెంగళూరు సిటీ నుంచి భువనేశ్వర్,

02846- యశ్వంత్‌పూర్ నుంచి భువనేశ్వర్


Next Story