Video: నాగరాజును కాటేసిన నాగుపాము.. పరిస్థితి విషమం

సత్యసాయి జిల్లా కదిరికి చెందిన నాగరాజు అనే యువకుడు మద్యం మత్తులో నాగుపాముతో ఆటలు ఆడాడు.

By అంజి
Published on : 25 July 2024 3:15 AM

Cobra, Kadiri , drunk man plays with snake, APnews

Video: నాగరాజును కాటేసిన నాగుపాము.. పరిస్థితి విషమం

సత్యసాయి జిల్లా కదిరికి చెందిన నాగరాజు అనే యువకుడు మద్యం మత్తులో నాగుపాముతో ఆటలు ఆడాడు. చివరకు పాము కాటు వేయడంతో ఆసుపత్రిలో చేరాడు. కదిరిలోని ఓ డిగ్రీ కళాశాల సమీపంలో నాగరాజుకు నాగుపాము కనిపించింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమీపంలోని పొదల్లోకి పాము తప్పించుకునేందుకు ప్రయత్నించినా, మద్యం మత్తులో ఉన్న నాగరాజు.. ఆ పామును పట్టుకుని మళ్లీ రోడ్డుపైకి తీసుకురావడం మొదలు పెట్టాడు.

అయితే అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు పాము నుండి దూరంగా వెళ్లాలని ఎంత చెప్పినా నాగరాజు పట్టించుకోలేదు. పాముతో పరాచకాలు ఆడాడు. దీంతో పాము నాగరాజును కాటు వేసింది. నాగరాజును నాగుపాము కాటేయడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. షాక్‌కు గురైన చూపరులు వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయగా, నాగరాజును అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

Next Story