Video: చెట్టు తొర్రలో నాటుసారా నిల్వ..డ్రోన్ కెమెరాతో గుట్టురట్టు

తిరుపతి జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు అధునాతన డ్రోన్స్‌తో తనిఖీలు చేపట్టారు.

By Knakam Karthik
Published on : 27 April 2025 2:50 PM IST

Andrapradesh, Tirupati District, Ap Police, Drone Search,

Video: చెట్టు తొర్రలో నాటుసారా నిల్వ..డ్రోన్ కెమెరాతో గుట్టురట్టు

తిరుపతి జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు అధునాతన డ్రోన్స్‌తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాకరాపేట సీఐ నేతృత్వంలో యర్రవారిపాళ్యం పోలీసు స్టేషన్ పరిధిలోని నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో రహస్యంగా చెట్ల చాటున సారా తయారు చేసి చెట్టు తొర్రలో దాచిన నాటు సారాను డ్రోన్ కెమెరా పసిగట్టింది. యర్రవారి పాళ్యం మండలంలోని వేములవాడ గ్రామం, తలకోన వాటర్ కెనాల్ సమీపంలో నాటు సారా స్థావరాన్ని గుర్తించి, చెట్టు తొర్రలో దాచిన తొమ్మిది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.

కాగా డ్రోన్ కెమెరాతో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రోన్ కెమెరా సిగ్నల్ ఇచ్చిన వెంటనే స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి.. నాటు సారా తయారు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారు డ్రోన్ కెమెరా డేగకళ్ల గప్పి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ తెలిపారు.

Next Story