వయో వృద్ధులకు దర్శనంపై దుష్ప్రచారం నమ్మొద్దు: టీటీడీ

తిరుమలలో వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

By -  అంజి
Published on : 6 Oct 2025 10:32 AM IST

misinformation, darshan, elderly, TTD, Tirumala

వయో వృద్ధులకు దర్శనంపై దుష్ప్రచారం నమ్మొద్దు: టీటీడీ

తిరుమలలో వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని, ఇవి పూర్తి అవాస్తవమని టీటీడీ తెలిపింది.

రోజూ 1000 మంది వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం మూడు నెలల ముందే ఆన్‌లైన్‌ కోటాను రిలీజ్‌ చేస్తుందనేదే వాస్తవం అని పేర్కొంది. టికెట్‌ పొందిన వ్యక్తికి రూ.50ల ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని తెలిపింది. తిరుమల నంబి ఆలయం సమీపంలోని సిటిజన్‌/ పీహెచ్‌సీ లైన్‌ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతి ఇస్తారని స్పష్టం చేసింది. సరైన సమాచారం కోసం https://www.tirumala.org/ వెబ్‌సైట్‌ సంప్రదించాలని సూచించింది.

అటు తిరుమలలో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 83,412 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Next Story