మహిళా డాక్టర్ దాతృత్వం.. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రూ.20 కోట్ల విరాళం
Doctor donates Rs 20 crore to Guntur govt hospital. తమ ఆస్తి మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి ఎవరూ కూడా సాహసించరు. అయితే ఓ మహిళా వైద్యురాలు తన రూ.20
By అంజి Published on 6 Oct 2022 12:32 PM ISTతమ ఆస్తి మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి ఎవరూ కూడా సాహసించరు. అయితే ఓ మహిళా వైద్యురాలు తన రూ.20 కోట్ల ఆస్తిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. డాక్టర్ ఉమా గవిని గుంటూరుకు చెందినవారు. ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె 1965లో మెడిసిన్ పూర్తి చేసి నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లింది. ఇమ్యునాలజీస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్‌గా స్థిరపడింది. ఆమె భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదివి అమెరికాలో ఉద్యోగం చేశారు. మూడేళ్ల క్రితం మృతి చెందగా వారికి పిల్లలు లేరు.
గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికాలోని జింకానా గత నెలలో డల్లాస్‌లో 17వ రీయూనియన్ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో డాక్టర్ ఉమ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా తన ఆస్తి మొత్తాన్ని తాను చదువుకున్న గుంటూరు జీజీహెచ్‌కు విరాళంగా ఇచ్చారు. 2008లో డాక్టర్ వృత్తిని చేపట్టిన ఉమా 'జింకానా' అధ్యక్షురాలిగా పని చేశారు. డాక్టర్ ఉమా అందించిన విరాళంతో.. జీజీహెచ్‌లో కొత్తగా నిర్మాణం అవుతోన్న ఎంసీహెచ్ బ్లాక్‌కు ఆమె పేరు పెడుతామని జింకానా సభ్యులు తెలిపారు.
అయితే ఈ ప్రతిపాదనను డాక్టర్ ఉమా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఉమా భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరు పెట్టాలని వైద్యులు నిర్ణయించారు. కాగా ఓ మహిళా డాక్టర్ తన యావదాస్థిని ఓ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వడంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక డాక్టర్ ఉమాను స్పుర్తిగా తీసుకోని మరి కొంత మంది దాతలు ముందుకు వచ్చారు. వారు సైతం గుంటూరు జీజీహెచ్‌కు భారీగా విరాళాలు ఇచ్చారు. అలాగే మరి కొంతమంది పూర్వ విద్యార్థులు సైతం విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.