ప‌వ‌న్ స‌భ క‌న్నా.. హ‌నీరోజ్ మీటింగ్‌కే ఎక్కువ జ‌నాలొస్తారు : ఎమ్మెల్యే కేతిరెడ్డి

Dharmavaram Mla Kethireddy Sensational Comments On Pawan Kalyan. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  30 Jun 2023 4:01 PM GMT
ప‌వ‌న్ స‌భ క‌న్నా.. హ‌నీరోజ్ మీటింగ్‌కే ఎక్కువ జ‌నాలొస్తారు : ఎమ్మెల్యే కేతిరెడ్డి

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ తాను ముఖ్య‌మంత్రిని అవుతా అంటే జ‌నాలు ఓటు వేస్తారేయో గానీ.. వేరే వాళ్ల ప‌ల్ల‌కి మోస్తానంటే ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌న్నారు. ఆయ‌న కోరిక త‌ను గెల‌వాల‌ని ఉండాలి కానీ.. వేరే వాళ్ల‌ను ఓడించాల‌ని ఉండ‌కూడ‌ద‌న్నారు. ఒక ప‌రుగు పందెంలో పాల్గొంటే మ‌నం ప‌స్ట్ రావడానికి ప‌రుగెత్తాలి కానీ.. ప‌క్క‌నున్నోడికి కాలు అడ్డుపెట్టి ముందుకు రావాల‌నుకోవ‌డం త‌ప్పు అని అన్నారు. రాజ‌కీయాలు వేరు.. సిపిమాలు వేరు అన్నారు. మీటింగ్‌ల‌కు వ‌చ్చిన జ‌నాలంద‌రూ మ‌న‌వాళ్లే అనుకుంటే త‌ప్ప‌ని అన్నారు. సినిమా గ్లామ‌ర్‌కు ఎప్ప‌టినుంచో జ‌నాలు వ‌స్తున్నార‌ని అన్నారు. బాల‌య్య సినిమాలో న‌టించిన హీరోయిన్‌ హ‌నీరోజ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు తిరుప‌తి జంక్ష‌న్‌లో మీటింగ్‌లు పెడితే.. హ‌నీరోజ్ కే స‌భ‌కే ఎక్కువ మంది జ‌నాలొస్తార‌ని వ్యాఖ్యానించారు. సినీ గ్లామ‌ర్ వేరు, ప్ర‌జా స‌మ‌స్య‌లు వేర‌ని అన్నారు. ప‌బ్లిక్ నీ నుంచి నువ్వేం మంచి చేస్తావ‌నే ఆశిస్తుంద‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న బ‌హిరంగ స‌భ‌ల్లో.. తోలు తీస్తా, తొక్క తీస్తా, బ‌ట్ట‌లు విప్పి కొడ‌తా.. అని మాట్లాడ‌టం త‌ప్ప‌.. జనాల‌కు ఏం చేస్తాడో చెప్ప‌ర‌ని అన్నారు. సినిమా వేరు.. నిజ జీవితం వేరు అని అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.


Next Story