Andhra Pradesh: వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. కోటి మందిపైగా పిల్లలకు..
వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ 'జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం' జరగనుంది. ఈ క్రమంలోనే ఏడాది నుంచి 19 ఏళ్లలోపు...
By - అంజి |
Andhra Pradesh: వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. కోటి మందిపైగా పిల్లలకు..
అమరావతి: వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ 'జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం' జరగనుంది. ఈ క్రమంలోనే ఏడాది నుంచి 19 ఏళ్లలోపు ఉన్న రాష్ట్రంలోని 1,11,63,762 మందికి అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లలు రాష్ట్రంలో 23,09,699 మంది ఉన్నారని ఆదివారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన వారు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్నారని తెలిపారు. కొందరు బడి బయట ఉన్నారన్నారు. వీరందరికీ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మహిళా, శిశు సంక్షేమ, ఇతర శాఖల సమన్వయంతో నిర్వహించబోతున్నామన్నారు.
నులి పురుగులతో రక్తహీనత, ఇతర సమస్యలు
మట్టి ద్వారా వ్యాపించే నులి పురుగులవల్ల రక్తహీనత, శారీరక ఎదుగుదల లోపం, కడుపు నొప్పి, బలహీనతకు నులిపురుగులు దోహదం చేస్తున్నాయి. వీటివల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఓ అంచనా ప్రకారం రాష్టంలో నులిపురుగుల వ్యాప్తి 34% వరకు ఉంది. ఇది ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఆల్బెండజోల్ మాత్రలు వాడడంద్వారా రక్తహీనత అదుపులోనికి వస్తోంది ఇతర ప్రయోజనాలు ఉంటాయి మాత్రల పంపిణీపై. ఏ.ఎన్.ఎంలు, ఆశా, అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ తెలిపారు
వయసుల వారిగా మాత్రల పంపిణీ పై విధివిధానాలు రూపొందించి, జిల్లాలకు పంపించామన్నారు. ప్రతి ఏడాది రెండుసార్లు మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.