విష్ణువర్ధన్ రెడ్డికి జీవిత ఖైదు

డిగ్రీ విద్యార్ధి అనూష హత్య కేసులో నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2021 ఫిబ్రవరి 21న నరసరావు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 April 2023 1:00 PM GMT
Degree student, Anusha murder case, Narasaraopet, APnews

విష్ణువర్ధన్ రెడ్డికి జీవిత ఖైదు

ఆంధ్రప్రదేశ్‌: డిగ్రీ విద్యార్ధి అనూష హత్య కేసులో నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2021 ఫిబ్రవరి 21న నరసరావుపేటలో డిగ్రీ విద్యార్ధి అనూషను విష్ణువర్ధన్ రెడ్డి గొంతు కోసి చంపాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో కోర్టు తుదితీర్పును వెల్లడించింది. విష్ణువర్ధన్ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

నర్సరావుపేటలోని కృష్టవేణి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అనూష డిగ్రీ చదువుతూ ఉండేది. గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామం అనూషది. విష్ణువర్ధన్ రెడ్డిది బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామం. విష్ణు.. అనూషను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. అయితే అనూష మరొకరితో చనువుగా ఉంటుందని అనుమానంతో 2021 ఫిబ్రవరిలో అనూష గొంతును విష్ణువర్ధన్ రెడ్డి కోశాడు. అనూషను హత్య చేసి విష్ణువర్ధన్ రెడ్డి కాలువలో పడేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

Next Story