10 ఏళ్ల బాలుడు మృతి.. శ్రీకాకుళంలో జిల్లాలో జీబీఎస్‌ భయం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్‌.. గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS)లక్షణాలతో మరణించాడు.

By అంజి  Published on  14 Feb 2025 6:59 AM IST
Death, Srikakulam, GBS , APnews

10 ఏళ్ల బాలుడు మృతి.. శ్రీకాకుళంలో జిల్లాలో జీబీఎస్‌ భయం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్‌.. గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS)లక్షణాలతో మరణించాడు. ఇది అంటువ్యాధి వైరస్ అని తప్పుడు వాదనల మధ్య ఈ వార్త సోషల్ మీడియాలో భయాందోళనలకు గురిచేసింది. మృతుడు సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన వాతాడ యువంత్‌. సోమవారం బ్రెయిన్‌డెడ్‌ కారణంగా మరణించాడు. ఆ బాలుడికి గొంతు నొప్పి, జ్వరం రావడంతో అతని తల్లిదండ్రులు చిరంజీవి, రోజా శ్రీకాకుళం, విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో చూపించారు. కానీ, అతన్ని కాపాడుకోలేకపోయారు. ఫిబ్రవరి 7వ తేదీన యువంత్‌ జీబీఎస్‌తో బాధపడుతున్నాడని తేలిందని తల్లిదండ్రులు అధికారులకు చెప్పారు.

జీబీఎస్‌తో బాలుడు మరణించాడన్న వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై శ్రీకాకుళం జిల్లా చీఫ్ హెల్త్ సూపర్‌వైజర్ (DCHS) కళ్యాణ్ బాబు గురువారం మాట్లాడుతూ.. జీబీఎస్‌ అనేది కొత్తది కాదని, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. "ఇది వైరస్ కాదు, చాలా కాలంగా తెలిసిన ఆటో ఇమ్యూన్ వ్యాధి" అని ఆయన అన్నారు. క్లాసిక్ లేదా ఆరోహణ పక్షవాతం అని కూడా పిలువబడే జీబీఎస్‌, దిగువ అవయవాలలో ప్రారంభమవుతుంది. సాంకేతికంగా అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డెమిలినేటింగ్ పాలీన్యూరోపతి (AIDP) అని పిలుస్తారు. ఇది చాలా అరుదైన పరిస్థితి, రెండు లక్షల జనాభాలో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

Next Story