కొత్తవలసలోని పాఠశాలకు బెక్‌హామ్.. మంత్రి లోకేష్ హర్షం
విజయనగరం జిల్లా కొత్త వలస పాఠశాలను సందర్శించిన ఫుట్‌బాల్ దిగ్గజం, యూనిసెఫ్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్‌కు...
By - అంజి |
కొత్తవలసలోని పాఠశాలకు బెక్‌హామ్.. మంత్రి లోకేష్ హర్షం
అమరావతి: విజయనగరం జిల్లా కొత్త వలస పాఠశాలను సందర్శించిన ఫుట్‌బాల్ దిగ్గజం, యూనిసెఫ్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్‌కు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 'విద్యార్థులకు మీరిచ్చిన ప్రోత్సాహం హర్షణీయం. మీ నుంచి నేర్చుకున్న పాఠాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. పిల్లల చదువు, భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా' అని ట్వీట్ చేశారు. బెక్‌హామ్ పాఠశాలను సందర్శించిన వీడియోను షేర్ చేశారు.
Thank you #DavidBeckham, legendary footballer & @UNICEFIndia Goodwill Ambassador, for visiting our Govt Residential School in Kothavalasa near #Vizag. Your heartfelt interactions, encouragement and playful energy lit up our classrooms and our playground. Our students were… pic.twitter.com/dP69O4fYDq
— Lokesh Nara (@naralokesh) November 27, 2025
ఫుట్‌బాల్ లెజెండ్, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ కొత్తవలసలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో సంభాషించారు. ఉల్లాసభరితమైన ఫుట్‌బాల్ సెషన్‌లలో పాల్గొన్నారు. బెక్‌హామ్ పిల్లలను పెద్ద కలలు కనమని ప్రోత్సహించడంతో పాటు దానిని ఎలా సాధించాలనే దానిపై చిట్కాలను కూడా పంచుకున్నారు. ఈ సందర్శన పిల్లలకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించింది. సందర్శన వివరాలను పంచుకున్న మంత్రి లోకేష్ నారా.. బెక్హాంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ఐకాన్ బేక్‌హమ్ విద్యార్థులపై శాశ్వత ముద్ర వేశారని, విద్యా, క్రీడలలో వారిని ప్రేరేపించారని ఆయన అన్నారు.