ఏమైనా గొడవలు, మనస్పర్థలు ఉన్నా అవి ఓ స్థాయి వరకే!! అవతలి వాళ్లు చనిపోయినా కూడా ఆ కోపం చూపెడతారా చెప్పండి. అలా ఓ కోడలు తన అత్త శవాన్ని ఇంట్లోకి రానిచ్చేదే లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. భర్త, బంధువులు వచ్చి చెప్పినా వీధిలోనే అత్త శవాన్ని ఉంచింది. చివరికి పోలీసులు కలగజేసుకోవడంతో కోడలు బెట్టు దిగింది.
శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధిలో నివాసం ఉంటున్న సురేశ్ తల్లి రమాదేవి మృతి చెందారు. సురేశ్‌కు భార్యతో మనస్పర్ధలు ఉన్నాయి. అందువల్ల అతని తల్లి మృతదేహాన్ని ఇంటిలోకి తీసుకెళ్లేందుకు భార్య అడ్డు చెప్పింది. సురేశ్ చేసేదేమీ లేక తల్లి మృతదేహాన్ని ఇంటి ముందుంచారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోడలకు నచ్చజెప్పడంతో ఆమె అడ్డు తప్పుకుంది.