బంగాళాఖాతంలో వాయుగుండం..రేపు తుపానుగా మారే అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

By -  Knakam Karthik
Published on : 25 Oct 2025 11:24 AM IST

Weather News, Andrapradesh, Bay of Bengal, Rain Alert

బంగాళాఖాతంలో వాయుగుండం..రేపు తుపానుగా మారే అవకాశం

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ & నికోబార్ దీవులు)కి 420కి.మీ., విశాఖపట్నంకి 990 కి.మీ., చెన్నై కి 990 కి.మీ., కాకినాడకి 1000 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి, ఎల్లుండి ఉదయానికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.

Next Story