ఆరేసిన బట్టలు తీస్తుండగా యువతి కరెంట్ షాక్..కాపాడబోయి తండ్రి కూడా మృతి
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2024 7:20 AM ISTఆరేసిన బట్టలు తీస్తుండగా యువతి కరెంట్ షాక్..కాపాడబోయి తండ్రి కూడా మృతి
విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపైన ఆరేసిన బట్టలు తీసేందుకు వెళ్లిన యువతి విద్యుత్‌షాక్‌కు గురైంది. ఆమె ఆర్తనాదాలువిన్న తండ్రి కాపాడేందుకు ప్రయత్నించి అతను కూడా కరెంట్‌షాక్‌కు గురయ్యాడు. దాంతో.. తండ్రీ కూతురు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన స్థానికంగా, ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
భోగాపురం దగ్గరున్న డి.తాళ్లవలస గ్రామానికి చెందిన సూర్యారావు ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలను బాగా చదవించి మంచిగా స్థిరపడ్డారు. అయితే.. కుమార్తె సంధ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. విశాఖలోని కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్ హోంలో భాగంగా ఇంటి వద్దే ఉంటోంది. శుక్రవారం రాత్రి తాళ్లవలసలో వర్షం పడింది దాంతో.. ఇంటిమేడపై ఉన్న బట్టలను తీసుకురావడానికి వెళ్లింది సంద్య. చున్నీ తీసే క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగ తగిలింది.దాంతో.. ఆమె కిందపడిపోయి కేకలు వేసింది.
కుమార్తె ఆర్తనాదాలు విన్న తండ్రి వెంటనే పైకి వచ్చాడు. కిందడిపోయి ఉన్న కూతురుని చూసి కంగారు పడ్డాడు. దాంతో.. వెంటేనే వెళ్లిఆమెను పైకి లేపే ప్రయత్నం చేశాడు. దాంతో.. సూర్యరావుకి కూడా విద్యుత్‌షాక్ కొట్టింది. ఇద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాసేపటికి సూర్యరావు కుమారుడు పైకి వచ్చి చూడగా ఇద్దరు కింద పడిఉన్నారు. కొనఊపిరితో ఉన్న సూర్యారావును ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని తెలిపారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.