ఏపీలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి రాష్ట్రంలో క‌ర్ప్యూ స‌డ‌లింపు వేళ‌ల్లో మ‌రో రెండు గంట‌ల మిన‌హాయింపు నిచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది. ఆ తరువాత మిగిలిన సమయం అంతా 144 సెక్షన్ అమలు పటిష్టంగా చేయాలని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ప్ర‌భుత్వం ఆదేశించింది. జూన్ 20వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

కాగా.. గురువారం వరకు రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు కొంచెం మెరుగవుతుండటంతో.. ఆ సడలింపులను మరో రెండు గంటలు అదనంగా పెంచారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని వేళల్లోనూ మార్పులు చేశారు. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే మిగిలిన నిబంధనలు అన్నీ తప్పని సరిగా పాఠించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం.

కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం దరిచేరనివ్వొద్దని సీఎం జగన్ సూచించారు. గతంలోలానే కఠినంగా కర్ఫ్యూ అమలు చేయాలని.. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. థర్డ్ వేవ్ అంటూ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరింత అలర్ట్ అవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా చిన్నారుల తల్లులను కూడా చేర్చింది ఏపీ ప్రభుత్వం.

తోట‌ వంశీ కుమార్‌

Next Story