సీపీఐ నారాయణ సతీమణి కన్నుమూత

By -  Nellutla Kavitha
Published on : 14 April 2022 7:18 PM IST

సీపీఐ నారాయణ సతీమణి కన్నుమూత

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సతీమణి గుండెపోటుతో మరణించారు. నారాయణ సతీమణి వసుమతి దేవి వయసు 65 సంవత్సరాలు. గురువారం సాయంత్రం మృతి చెందినట్లుగా కుటుంబసభ్యులు ప్రకటించారు. తీవ్ర గుండె పోటు రావడంతో ఆమె తుది శ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం గుండెకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు మూడు స్టెంట్లు వేసారు. అప్పటినుంచి ఆమె తిరుపతిలోని రుయా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇక అక్కడే ఆమెకు ఈరోజు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరి నియోజకవర్గం ఐనం బాకం గ్రామం లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు ప్రకటించారు. వసుమతి మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story