ఏపీ సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం..
Couple suicide attempt at AP Secretariat.ఏపీ సచివాలయం వద్ద కలకలం రేగింది. నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు
By తోట వంశీ కుమార్ Published on
27 Feb 2021 9:49 AM GMT

ఏపీ సచివాలయం వద్ద కలకలం రేగింది. నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్ వద్ద తమ పిల్లలతో సహా ఆత్మయత్యకు యత్నించారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తం అయి వారిని అడ్డుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా దుత్తలూరు తహసీల్దారు చంద్రశేఖర్ తమను మోసం చేశారని ఆరోపించారు. చిట్టమూరు మండలం చిలుమూరులో ఉన్న తమ పొలాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు ఇప్పటి వరకు రూ.కోటికి పైగా ఇచ్చామని చెప్పారు.
నగదును ఇచ్చి ఏడాది గడుస్తున్నా.. తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని వాపోయారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. సచివాలయం వద్ద ఉన్న పోలీసులు అడ్డుకుని దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story