చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆర్పీఎఫ్‌ బ్యారక్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డాడు. ఈయ‌న‌ రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యారక్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్ల‌వారుజామున నాలుగున్న‌ర గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు రేణిగుంట అర్భ‌న్ పోలీసులు తెలిపారు.

కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. ఆనంద‌రావు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా చింతలపూరి గ్రామంగా పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story