ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు వేర్వేరుగా నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

By అంజి
Published on : 14 March 2025 1:30 PM IST

APRJC SET, APRDC SET, applications, APnews

ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు వేర్వేరుగా నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు 10వ తరగతి చదువుతున్నవారు, ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు, ఇంటర్‌ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చివరి తేదీ మార్చి 31. ఏప్రిల్‌ 17న హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. ఏప్రిల్‌ 25న ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించి, మే 14వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 1149 సీట్లు ఉండగా, డిగ్రీ కాలేజీలో 220 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపులు ఉండగా.. డిగ్రీలో బీఏ పొలిటికల్‌ సైన్స్‌, బీకామ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీకామ్‌ ట్యాక్స్‌ ప్రొసిడర్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌, బీఎస్సీ డేటా సైన్స్‌, బీఎస్సీ జువాలజీ కోర్సులు ఉన్నాయి. ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. సీటు పొందినవారికి విద్య, వసతి సదుపాయం కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. పూర్తి వివరాలకు https://aprs.apcfss.in/ను విజిట్‌ చేయండి.

Next Story