ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మృతదేహాలు వెలికితీత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీశామని కలెక్టర్ సిరి వెల్లడించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు కలిపి 41 మంది ఉన్నారు.
By - అంజి |
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మృతదేహాలు వెలికితీత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీశామని కలెక్టర్ సిరి వెల్లడించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు కలిపి 41 మంది ఉన్నారు. 21 మంది సురక్షితంగా ఉన్నారు. స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని తెఇలపారు. 11 మంది మృతదేహాలను వెలికి తీశామని, మిగతా డెడ్‌బాడీలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. బైక్ ఇరుక్కుపోవడంతో బస్సు డోర్ ఓపెన్ చేయలేకపోయారని చెప్పారు.
కాగా ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్‌ల రమేష్ (35), కుమారుడు యశ్వంత్ (8), కూతురు మన్విత (6), భార్య అనూష (32) మృతి చెందారు. అటు బస్సు ఢీకొట్టడంతో పల్సర్ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయాడు. అతడు కర్నూలు జిల్లా ప్రజానగర్‌కు చెందిన శంకర్‌గా గుర్తించారు.
ప్రధాని దిగ్భ్రాంతి
ఈ ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించారు.
కంట్రోల్ రూమ్‌లు
కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సిరి వెల్లడించారు.
కలెక్టరేట్‌లో: 08518 - 277305
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (కర్నూలు): 9121101059
ఆన్-సైట్ కంట్రోల్ రూమ్: 9121101061
కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్: 9121101075
GGH హెల్ప్ డెస్క్‌లు: 9494609814, 9052951010
ప్రమాదం జరిగిన బస్సుపై భారీగా జరిమానాలు
ప్రమాదానికి గురైన బస్సుపై చాలా జరిమానాలు ఉన్నాయి. ఇటీవల ఓవర్ స్పీడ్, డేంజర్ స్పీడ్ చలాన్లు నమోదయ్యాయి. మొత్తం రూ.23 వేల వరకు ఫైన్లు ఉన్నాయి. వేమూరి కావేరి సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి ఈ జరిమానాలే నిదర్శనం. 2024 ఏప్రిల్‌లో ఇన్సూరెన్స్, గత మార్చిలో ఫిట్‌నెస్ వ్యాలిడిటీ ముగిశాయి.