Video: అనాథ పిల్లలతో ముచ్చటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటిస్తున్నారు. నగరంలోని రాఘవయ్య పార్కు సమీపంలోని
By అంజి Published on 30 May 2023 12:15 PM ISTఅనాథ పిల్లలతో ముచ్చటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటిస్తున్నారు. నగరంలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించి అనాథ పిల్లలతో మాట్లాడారు. అంతకుముందు అక్కడే నిర్మించిన నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. నిర్మలా హృదయ్ భవన్ ఆవరణలో ఉన్న మథర్ థెరిసా విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా పాల్గొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నాలుగేళ్లలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారన్నారు. పదకొండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు 'జగనన్నే మా భవిష్యత్తు', 'జగనన్నకు చెబుతాం' వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్.
విజయవాడ, మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల హృదయ నూతన భవనం ప్రారంభోత్సవం. పాల్గొన్న సీఎం శ్రీ వైయస్ జగన్. అనాథ పిల్లలతో ముచ్చటించిన సీఎం. #CMYSJagan pic.twitter.com/6YVAzkkHb8
— YSR Congress Party (@YSRCParty) May 30, 2023