Odisha Train Accident: సహాయక చర్యల కోసం.. స్పెషల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని సహాయక చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

By అంజి  Published on  3 Jun 2023 4:50 AM GMT
CM YS Jagan, Odisha train accident, Minister Amarnath

Odisha Train Accident: సహాయక చర్యల కోసం.. స్పెషల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌

అమరావతి: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని సహాయక చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి జి. అమర్‌నాథ్‌ నేతృత్వం వహిస్తారు. శనివారం తెల్లవారుజామున సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా సీఎంఓ, రైల్వే శాఖ అధికారులతో టచ్‌లో ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో విచారణ, ఫిర్యాదుల సెల్‌లను ఏర్పాటు చేసి తక్షణమే స్పందించాలని జగన్ మోహన్ రెడ్డి వారికి సూచించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఆనంద్‌, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌తో కూడిన ప్యానెల్‌, అమర్‌నాథ్‌తో కలిసి ప్రమాద స్థలిని సందర్శించి సహాయక చర్యలు చేపట్టనున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తాజా పరిణామాలను తనకు తెలియజేయాలని కూడా ఆయన ఆదేశించారు.

Next Story