ఇవాళ్టి నుంచి 'గోరుముద్దలో రాగి జావ'.. లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: జగనన్న గోరుముద్ద ద్వారా పాఠశాల పిల్లలకు వారానికి 3 రోజులు ఉదయం పూట రాగి జావ అందించే

By అంజి  Published on  21 March 2023 2:19 PM IST
CM YS Jagan,  ragi java, jagananna gorumudda scheme

'ఇవాళ్టి నుంచి గోరుముద్దలో రాగి జావ'.. లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: జగనన్న గోరుముద్ద ద్వారా పాఠశాల పిల్లలకు వారానికి 3 రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యలోనూ సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్థుల భవిష్యత్‌కు అండగా ఉంటున్నామని చెప్పారు.

గోరుముద్ద కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా అమలు చేస్తున్నామని, ఇవాళ్టి నుంచి గోరుముద్దలో రాగి జావ చేరుస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ పథకం అందిస్తున్నామని చెప్పారు. సత్యసాయి ట్రస్ట్‌ సహాకారంతో విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నామని, ఈ కొత్త పథకానికి ఏటా 86 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని తెలిపారు. బడి పిల్లల మేథో వికాసానికి అనుకూల వాతావరణంపై దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

1 నుంచి 10వ తరగతి పిల్లలకు దాదాపు 38 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకసారి తేడాను గమనించాలని సీఎం జగన్‌ సూచించారు. రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నామని అన్నారు. పిల్లలకు మంచి మేన మామలా.. ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. వారంలో ఐదు రోజుల పాటు ఉడికించిన గుడ్డు ఇస్తున్నామని తెలిపారు.

Next Story