నేడు, రేపు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM YS Jagan Kadapa District tour full details.ముఖ్యమంత్రి జగన్ నేడు, రేపు వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు
By తోట వంశీ కుమార్
ముఖ్యమంత్రి జగన్ నేడు, రేపు వైయస్ఆర్ (కడప) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం జగన్ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
నేటీ షెడ్యూల్..
- శుక్రవారం ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
- అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వెళ్తారు.
- 11.15 నుంచి స్థానిక నేతలతో మాట్లాడిన అనంతరం.. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు.
- అనంతరం 12.40 నుంచి 1.00 మధ్యలో వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు.
- మధ్యాహ్నాం 1.00 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.
- మధ్యాహ్నాం 1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపుల పాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
శనివారం పర్యటన షెడ్యూల్..
- డిసెంబర్ 3న ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి హెలికాఫ్టర్‌లో 8.55 గంటలకు పులివెందుల భాకాపురం చేరుకుంటారు.
- అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎస్‌సీఎస్‌ఆర్ గార్డెన్స్‌కు వెళ్తారు.
- 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం 9.35 గంటలకు అక్కడి నుంచి భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
- అక్కడి నుంచి 9.45 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరతారు. 10.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
-10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.