సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన.. ఈ నెల 26కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. అనివార్య కారణాల వల్ల రేపటి సీఎం
By అంజి Published on 16 April 2023 1:45 PM ISTసీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన.. ఈ నెల 26కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. అనివార్య కారణాల వల్ల రేపటి సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 26న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గలోని నార్పల్ మండలంలో సీఎం పర్యటించి జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కాగా ముస్లిం సోదరులకు రేపు (సోమవారం) ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. విజయవాడలోని విద్యాధరపురం మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందుకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
సోమవారం నార్పలలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజలు, జిల్లా అధికారులు కృషి చేయాలని విద్యుత్, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎం గౌతమి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని చేయాలన్నారు. వేడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ, రవాణా శాఖ బస్సులను ఏర్పాటు చేయాలని, అంబులెన్స్‌లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యశాఖను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లతో పాటు సీఎం కాన్వాయ్‌ను ఎయిర్‌స్ట్రిప్ నుంచి సభా వేదిక వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎస్పీకి సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడారు. అయితే ఉన్న పలంగా సీఎం పర్యటన వాయిదా పడింది.