ఆలయాల పునర్నిర్మాణానికి నేడు సీఎం శంకుస్థాప‌న‌

CM laid the foundation stone for the reconstruction of the temples. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి నేడు సీఎం శంకుస్థాప‌న.

By Medi Samrat  Published on  8 Jan 2021 2:31 AM GMT
CM laid the foundation stone for the reconstruction of the temples

టీడీపీ ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ రోజు ఉదయం 11:01 నిమిషాలకు ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారిపాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయాల పునర్నిర్మాణం చేయనున్నారు. కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాలపునర్నిర్మాణానికి సీఎం జ‌గ‌న్‌ శంకుస్థాపన చేయనున్నారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.

విజయవాడలో పునర్నిర్మాణం చేపట్టే ఆలయాలు..

♦️రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణం

♦️రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణం

♦️రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం

♦️రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణం

♦️రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణం

♦️రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం(దుర్గగుడి మెట్ల వద్ద)

♦️రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయ పునర్నిర్మాణం

♦️రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం పునర్నిర్మాణం (పోలీస్‌ కంట్రోల్‌ రూం సమీపంలో)

♦️రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల పునర్నిర్మాణం


Next Story
Share it