రేపు సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలు పర్యటన

CM Jagan will visit Nidudavolu Tomorrow. రేపు సీఎం వైఎస్‌ జగన్‌ తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలులో పర్యటించ‌నున్నారు.

By Medi Samrat  Published on  28 Feb 2023 2:40 PM GMT
రేపు సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలు పర్యటన

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలులో పర్యటించ‌నున్నారు. నిడుదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు నిడుదవోలు చేరుకుంటారు. 11 గంటలకు నిడుదవోలు గాంధీనగర్‌లో సెయింట్‌ ఆంబ్రోస్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న నిడుదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం 11.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story