సీఎం జగన్ ఇవాళ కాకినాడలో పర్యటించనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుంచి వైఎస్‌ఆర్ పెన్షన్ కానుకను ప్రభుత్వం రూ.3 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని.. ఇప్పుడు అమలు చేయబోతోంది ప్రభుత్వం. లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను, కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డులను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. పెన్షన్ల పెంపు పై కార్యక్రమంలో సీఎం జగన్.. 2,750 రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచనున్నారు. కాగా.. ప్రభుత్వం ఏటా 66.34 లక్షల మందికి పెన్షన్లు అందిస్తుంది. పెన్షన్ల పై ఏటా వ్యయం రూ.23,556 కోట్లు చేయనుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం సుమారు 83,526 కోట్లు. పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.