నేడు వారి అకౌంట్లలోకి రూ.30,000
2023–24 సంవత్సరానికి సంబంధించి వైఎస్‌ఆర్ లా నేస్తం రెండో విడత నిధులను ఇవాళ సీఎం జగన్ యువ న్యాయవాదుల అకౌంట్లలో జమ చేస్తారు.
By అంజి Published on 11 Dec 2023 6:43 AM ISTనేడు వారి అకౌంట్లలోకి రూ.30,000
2023–24 సంవత్సరానికి సంబంధించి వైఎస్‌ఆర్ లా నేస్తం రెండో విడత నిధులను ఇవాళ సీఎం జగన్ యువ న్యాయవాదుల అకౌంట్లలో జమ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది యువ న్యాయవాదులు ఉన్నారు. వారికి నెలకు రూ.5 వేల చొప్పున 6 నెలల స్టైపెండ్ రూ.30,000 జమ చేస్తారు. సీఎం జగన్ సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం మొత్తం రూ.7,98,95,000 కోట్లు వెచ్చిస్తోంది.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి మూడేళ్లపాటు ఏడాదికి రూ.60 వేలను రెండు విడతల్లో ప్రభుత్వం అందిస్తోంది. కొత్తగా లా డ్రిగీ పూర్తి చేసిన న్యాయవాదులు ఆ వృత్తిలో నిలదొక్కుకునేలా మూడు సంవత్సరాల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్ల పాటు రూ.1.80 లక్షలు ఇస్తోంది. కాగా నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. వైఎస్సార్ లా నేస్తం స్కీంకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 'జగనన్నకు చెబుదాం' ద్వారా 1902 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. ఈ స్కీంను మరింత సమర్థంగా మానిటర్ చేస్తూ యువ న్యాయవాదులు ఏకకాలంలో పెద్దమొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునే విధంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం వారి ఖాతాల్లో నిధులు జమచేస్తోంది. https://ysrlawnestham.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.